Site icon NTV Telugu

Ampere Reo 80: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర.. సూపర్ ఫీచర్లు

Ev

Ev

ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీలకు డిమాండ్ పెరగడంతో ఎలక్ట్రిక్ టూవీర్ తయారీ కంపెనీలు సూపర్ ఫీచర్స్ తో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈవీ లవర్స్ కు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ కొత్త ఆంపియర్ రియో ​​80 EV స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, RC అవసరం లేదు. ఎందుకంటే ఇది లో స్పీడ్ స్కూటర్ కాబట్టి. లుక్స్ పరంగా కూడా కస్టమర్లను ఆకర్శిస్తోంది.

Also Read:Retro : సూర్య కోసం సూపర్ స్టార్..?

కొత్త ఆంపియర్ రియో ​​80 EV స్కూటర్ ధర విషయానికి వస్తే.. కంపెనీ ఈ స్కూటర్‌ను రూ. 59,000 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కొత్త ఆంపియర్ రియో ​​80 EV స్కూటర్‌లో అనేక స్మార్ట్, అధునాతన ఫీచర్లను అందించారు. ఈ స్కూటర్‌లో కలర్ LCD క్లస్టర్, LFP బ్యాటరీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 80 కి.మీ.ల వరకు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఈ స్కూటర్‌లో అల్లాయ్ వీల్స్ అందించారు.

Exit mobile version