మాస్ మహారాజ రవితేజ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి.. ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది.2003లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. మదర్ సెంటిమెంట్‌కు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి పేరుతో దర్శకుడు మోహన్‌రాజా తమిళం లో రీమేక్ చేశారు. తమిళ రీమేక్‌లో జయం రవి హీరోగా నటించాడు. తమిళ వెర్షన్‌లో కూడా ఆసిన్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో తల్లి పాత్ర పోషించిన జయసుధ క్యారెక్టర్ ను తమిళం లో నదియా చేసింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన నదియాకు ఈ రీమేక్ మంచి కమ్‌బ్యాక్‌గా నిలిచింది.
అయితే ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి రీమేక్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్‌రాజా వెల్లడించాడు. ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి 2 పేరుతో ఈ సినిమాను రూపొందిస్తోన్నట్లు పేర్కొన్నాడు. ఈ సీక్వెల్‌కు సంబంధించి కథ మొత్తం పూర్తయినట్లు, త్వరలోనే షూటింగ్‌ను కూడా మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు. ఈ సీక్వెల్‌లో జయం రవి హీరోగా నటిస్తాడని ఆయన తెలిపారు… కానీ ఇందులో నదియా రోల్ ఉండదని మోహన్‌రాజా తెలిపారు.త్వరలోనే ఈ సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో రీసెంట్ గా చిరంజీవి తో గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కించిన మోహన్ రాజా ఆ తర్వాత అక్కినేని నాగార్జున, అఖిల్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు.. కానీ అనుకున్న స్థాయిలో స్క్రిప్ట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ మల్టీస్టారర్ స్థానంలోనే అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ సీక్వెల్ చేయబోతున్నట్లు సమాచారం.