NTV Telugu Site icon

Kalki 2898 AD : అమితాబ్ ‘అశ్వద్దామ’ న్యూ లుక్ వైరల్..

Amithab

Amithab

Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD ” .ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.

Read Also :Akhanda 2 : ఆ రోజున ‘అఖండ 2’ స్పెషల్ అనౌన్స్మెంట్..?

రీసెంట్ గా ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని ఓ రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి ప్రేక్షకులకు పరిచయం చేసారు.ఈ సినిమాలో బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్ ..అంతేకాదు బుజ్జి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ కూడా..ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో ప్రత్యేకమని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు .ఇదిలా ఉంటే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.అశ్వద్ధామ పాత్రను మేకర్స్ మధ్యప్రదేశ్ లోని నెమవార్,నర్మద ఘాట్ వద్ద గ్రాండ్ గా లాంచ్ చేసారు.ద్రోణ సుతుడైన అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అద్భుతంగా నటించారు.తాజాగా అశ్వద్ధామగా అమితాబ్ న్యూ లుక్ రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆ లుక్ బాగా వైరల్ అవుతుంది.

Show comments