Black : థియేటర్స్ లో రిలీజ్ అయిన 19 ఏళ్లకు ఓటీటీలోకి వచ్చిన అమితాబ్ ‘బ్లాక్’ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బ్లాక్’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రాలలో నటించారు.2005 ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా విడుదలైన 19 సంవత్సరాలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సూపర్ హిట్ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.‘బ్లాక్’ ఓటీటీ స్ట్రీమింగ్ విషయన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “సంజయ్ లీలా బన్సాలీ ‘బ్లాక్’ విడుదలై 19 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు మేము నెట్ ఫ్లిక్స్ లో తొలిసారిగా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాం” అని వెల్లడించింది.
ఈ సినిమాలో దేబ్రాజ్ అనే ఉపాధ్యాయుడి పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు. చెవిటి మూగ అమ్మాయి పాత్రలో రాణి ముఖర్జీ కనిపించింది.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్ మరియు ధృతిమాన్ ఛటర్జీ ఇతర పాత్రల్లో అద్భుతంగా జీవించారు. ‘బ్లాక్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫిబ్రవరి 4, 2005న విడుదలైన ‘బ్లాక్’ చిత్రం అదే రోజున నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. సినిమా 19వ వార్షికోత్సవం సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అమితాబ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “బ్లాక్ విడుదలై 19 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ లోకి తీసుకొస్తున్నాం. దేబ్రాజ్, మిచెల్ ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని భావిస్తున్నాం” అని రాసుకొచ్చారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
It's been 19 years since Sanjay Leela Bhansali’s Black released, and today we're celebrating it's first ever digital release on Netflix!
Debraj and Michelle's journey has been an inspiration to all of us, and we hope it instills you with strength and compassion ❤️… pic.twitter.com/PfJnqHQ5V4— Netflix India (@NetflixIndia) February 4, 2024
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!