Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే అమితాబ్ బచ్చన్, 83 ఏళ్ల వయసులోనూ విశ్రాంతి లేకుండా పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా తన బ్లాగ్‌లో పని పట్ల తనకున్న మక్కువను వివరిస్తూ.. ఏ కారణం లేకుండా సోమరిగా గడపాల్సి వస్తే అది తనను తీవ్రంగా కలవరపెడుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఒక పద్ధతి ప్రకారం సాగే షెడ్యూల్ తప్పినప్పుడు, ఆ రోజంతా తనకు ఒక మిస్టరీలా అనిపిస్తుందని, పనులన్నీ గందరగోళంగా మారినట్లు అనిపిస్తుందని బిగ్ బి ఆవేదన వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగా పని సాగనప్పుడు మనసులో ఆందోళన మొదలవుతుందని, అది అనవసరమైన ఒత్తిడికి దారితీస్తుందని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.
Also Read : JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఇటీవలే అత్యంత ప్రజాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ (KBC) 17వ సీజన్‌ను ముగించిన అమితాబ్, ఆ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవిత కాలంలో మూడో వంతు సమయం ప్రేక్షకులతోనే గడిపానని, అది తన అదృష్టమని కన్నీటి పర్యంతమయ్యారు. వృత్తిపరంగా చూస్తే, గతేడాది ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వత్థామగా తన విశ్వరూపాన్ని చూపించిన బిగ్ బి, ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నారు. ఎంతటి ఘనత సాధించినా, ఎన్ని అవార్డులు అందుకున్నా ఇప్పటికీ మొదటి రోజులాగే పని పట్ల ఆయన చూపిస్తున్న ఈ అంకితభావం నేటి యువతరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పక తప్పదు.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!