Site icon NTV Telugu

Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

Amithab Bhachan

Amithab Bhachan

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే అమితాబ్ బచ్చన్, 83 ఏళ్ల వయసులోనూ విశ్రాంతి లేకుండా పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా తన బ్లాగ్‌లో పని పట్ల తనకున్న మక్కువను వివరిస్తూ.. ఏ కారణం లేకుండా సోమరిగా గడపాల్సి వస్తే అది తనను తీవ్రంగా కలవరపెడుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఒక పద్ధతి ప్రకారం సాగే షెడ్యూల్ తప్పినప్పుడు, ఆ రోజంతా తనకు ఒక మిస్టరీలా అనిపిస్తుందని, పనులన్నీ గందరగోళంగా మారినట్లు అనిపిస్తుందని బిగ్ బి ఆవేదన వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగా పని సాగనప్పుడు మనసులో ఆందోళన మొదలవుతుందని, అది అనవసరమైన ఒత్తిడికి దారితీస్తుందని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.

Also Read : JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

ఇటీవలే అత్యంత ప్రజాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ (KBC) 17వ సీజన్‌ను ముగించిన అమితాబ్, ఆ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవిత కాలంలో మూడో వంతు సమయం ప్రేక్షకులతోనే గడిపానని, అది తన అదృష్టమని కన్నీటి పర్యంతమయ్యారు. వృత్తిపరంగా చూస్తే, గతేడాది ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వత్థామగా తన విశ్వరూపాన్ని చూపించిన బిగ్ బి, ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నారు. ఎంతటి ఘనత సాధించినా, ఎన్ని అవార్డులు అందుకున్నా ఇప్పటికీ మొదటి రోజులాగే పని పట్ల ఆయన చూపిస్తున్న ఈ అంకితభావం నేటి యువతరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పక తప్పదు.

Exit mobile version