Amitabh Bachchan says Fake News about Angioplasty Reports: ‘బిగ్‌బీ’ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల అమితాబ్‌కు ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే తన ఆరోగ్యం సరిగా లేదని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) ఫైనల్ మ్యాచ్ చూసేందుకు థానేకు వచ్చారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబై, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు కుమారుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి హాజరయ్యారు. అక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్‌తో కలిసి బిగ్‌బీ కనిపించారు. వారిని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read:
మ్యాచ్ చూసేందుకు వెళ్లిన అమితాబ్ బచ్చన్‌ను తన ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించగా.. అందులో ఎలాంటి నిజం లేదని, ఆ వార్తలు అన్ని ఫేక్ అని తెలిపారు. అసలు విషయం తెలుసుకున్న బిగ్‌బీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్ త్వరలో ప్రభాస్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’లో కనిపించబోతున్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్, వెట్టయన్ చిత్రంలో కూడా ఆయన నటించనున్నారు.