బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు.. ఆయన వయసు పెరుగుతున్న సినిమాలను తగ్గించడం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అయితే తాజాగా ఈయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది..
అమితాబ్ బచ్చన్ ఈరోజు తెల్లవారుజామున అస్వస్తకు గురయ్యారు. తెల్లవారు జామున కాస్త నలతగా ఉండటంతో ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.. అయితే ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. వయసు పై బడటం తప్ప మరే ఇతర సమస్యలు లేవని వైద్యులు చెబుతున్నారు.. త్వరగా పరీక్షలు చేసి ఇంటికి పంపిస్తారని, ఫ్యాన్స్ ఆందోళన పడవద్దు అని కుటుంబ సభ్యులు తెలిపారు..
ప్రస్తుతం ఆయన వయసు 81 ఏళ్లు.. గతంలో చాలాసార్లు ఆయన జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు.. అయితే 80ఏళ్లు నిండిన ఈ వృద్ధ నటుడు …ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు ప్రీ వెడ్డింగ్ బాష్ కి కూడా అటెండ్ అయ్యారు. కుటుంబ సభ్యులతో పార్టీకి అటెండ్ అయిన సమయంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇంతలోనే ఇలా అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు..