Site icon NTV Telugu

Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ

Amith Shah

Amith Shah

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 24 గంటల్లోనే అమిత్ షా తెలంగాణలో పర్యటించడం తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. అమిత్ షా మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Read Also:Vedanta : వేదాంత కంపెనీకి ట్యాక్స్ అథారిటీ భారీ జరిమానా.. ఎందుకంటే?

అక్కడ సభ ముగిసిన అనంతరం 5.15 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్‌ సిక్‌ విలేజ్‌లో మేధావులతో సమావేశం అవుతారు. అనంతరం కాకతీయ హోటల్‌లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చిస్తారు. రాత్రి 7.30 గంటలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా చేపట్టాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Read Also:Indira Ekadashi Special: ఇందిరా ఏకాదశి శుభవేళ ఈ స్తోత్రాలు వింటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 3న వస్తుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023. పరిశీలనకు చివరి తేదీ నవంబర్ 13. ఉపసంహరణకు చివరి తేదీ 15 నవంబర్. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.

Exit mobile version