NTV Telugu Site icon

Amit Shah Munugode SamaraBheri Live Updates: మునుగోడులో అమిత్ షా సమరభేరి లైవ్ అప్ డేట్స్

30344b83 3b38 45ec 9cdc Ccf6873582fb

30344b83 3b38 45ec 9cdc Ccf6873582fb

మునుగోడు ఉపఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నేడు బీజేపీ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆధ్వర్యంలో టీఆర్ఎస్(TRS) భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా అమిత్ షా ఏం మాట్లాడతారనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన సమక్షంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(komatireddy rajagopal reddy) బీజేపీలో చేరనున్నారు. షా పర్యటన నేపథ్యంలోనే బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, అసెంబ్లీ స్పీకర్ దానిని ఆమోదించడంతో ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడులోనూ బీజేపీ జెండా ఎగరేయాలని కమలనాథులు స్కెచ్చేశారు.సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులతో సమావేమవుతారు. 6‌.05గంటల నుంచి 6.50 వరకు మునుగోడులో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకుని ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో అమిత్ షా భేటీ అవుతారు. అనంతర ఆర్ఎఫ్‌సీ నుంచి రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు 7.50గంటలకు చేరుకుంటారు. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు బీజేపీ కీలక నేతలతో సమావేవమవుతారు. అదే హోటల్‌లో భోజనం చేసి 9.25 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

Show comments