NTV Telugu Site icon

Amit shah: ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై రాహుల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

Raek

Raek

కాంగ్రెస్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ అతిపెద్ద ఎక్స్‌టార్షన్‌ స్కీమ్‌ అయితే కాంగ్రెస్‌ కూడా ఈ స్కీమ్‌ కింద అక్రమ వసూళ్లకు పాల్పడిందని అమిత్ షా ఆరోపించారు. తాము కూడా ఈ స్కీమ్‌ కింద వసూళ్లు చేశామని రాహుల్‌ ప్రజలకు చెప్పాలన్నారు. ఎంపీల సంఖ్య ప్రకారం చూస్తే ప్రతిపక్షాలే అత్యధికంగా ఎన్నికల బాండ్ల స్కీమ్‌లో లాభపడ్డాయని తెలిపారు. ప్రతిపక్షాలకు తమను విమర్శించడానికి ఏమీ లేదని.. అందుకే ప్రజలను కావాలని గందరగోళానికి గురిచేస్తున్నాయని అమిత్ షా ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Chandrababu: ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే..!

పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నందున ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధం.. ఏకపక్షమని, రాజకీయ పార్టీలు మరియు దాతల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నల్లధనంపై పోరాడడం  అనే నిర్దేశిత లక్ష్యంగా ఈ పథకాన్ని సమర్థించలేమని పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని కోర్టు తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి: CM YS Jagan: బీ ఫామ్ ఏ పార్టీది అయినా.. యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే..!

భారత ఎన్నికల సంఘానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాలు అందించింది. అనంతరం ఈసీ వెబ్‌సైట్‌లో పొందిపరిచింది. 2018లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ బాండ్ల ద్వారా బీజేపీ గరిష్టంగా నిధులు పొందినట్లు తెలుస్తోంది. బీజేపీ-రూ. 6,986.5 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ రూ. 1,397 కోట్లు, కాంగ్రెస్ రూ.1,334 కోట్లు పొందినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Karnataka: కాంగ్రెస్ గూటికి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు..