NTV Telugu Site icon

Amit sha: శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రిని కలిసిన రెజ్లర్లు.. చట్టం అందరికీ సమానమేనని అమిత్ షా భరోసా

Amit Sha

Amit Sha

Amit Sha: బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. బ్రిష్ భూషన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా ఇంటోలో రాత్రి 11 గంటలకు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్, భజరంగ్ పునియా హాజరయ్యారు.

Also Read: Mahesh Pawan: ఈ కాంబినేషన్ గురించి జక్కన 12 ఏళ్ల క్రితమే చెప్పాడు

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాని కోరారు. అందుకు షా.. చట్టం అందరికీ సమానమేనన్నట్లు వారికి భరోసా ఇచ్చారు. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు.

Also Read: Minister Peddireddy Ramachandra Reddy: ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..

మరోవైపు హరిద్వార్‌లో పతకాలను గంగా నదిలో కలిపే నిర్ణయాన్ని నిరసనలు చేస్తున్న మల్లయోధులు రద్దు చేసుకున్న తర్వాత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఐదు రోజుల గడువు పెట్టారు. ఈ ఐదు రోజుల డెడ్ లైన్ శనివారంతో ముగిసింది. మరోవైపు హోం మంత్రి అమిత్ షా సమాధానంపైనా రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘హోం మంత్రి నుంచి మేం ఆశిస్తున్న సమాధానం రాలేదు. అందుకే సమావేశం నుంచే బయటకు వచ్చేశాం. భావి నిరసనల గురించి వ్యూహాన్ని రచిస్తున్నాం. మేం వెనుదిరిగే ప్రసక్తే లేదు’ అని రెజ్లర్ కడియన్ స్పష్టం చేశారు.