NTV Telugu Site icon

Shimla: సిమ్లాలో భారీగా ట్రాఫిక్ జామ్.. న్యూ ఇయర్ వేళ పోటెత్తిన పర్యాటకులు..

Simla

Simla

గత కొంత కాలంగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతుంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ రావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి, కసోల్, తదిరల ఏరియాల్లో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. జస్ట్ మూడు రోజుల్లోనే వేల సంఖ్యలో వెహికిల్స్ సిమ్లాలోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Vijayakanth: కెప్టెన్ విజయకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఇవే…

అయితే, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్ తంగ్ లోని అటల్ సొరంగం గుండా మూడు రోజుల్లో దాదాపు 55,000 వేల కంటే ఎక్కువ వెహికిల్స్ సిమ్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇక, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ కేవలం 24 గంటల వ్యవధిలో 28 వేల 210 వెహికిల్స్ అటల్ సొరంగం గుండా వెళ్లినట్లు పేర్కొన్నారు. ఓ వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రావడంతో ఆ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Read Also: Janhvi Kapoor: స్విమ్ సూట్ తో చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్…

భారీగా ట్రాఫిజ్ స్తంభించి పోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిమ్లాకు పర్యాటకుల తాకిడి పెరగడంతో సందడిగా మారింది. అయితే, అక్కడి పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో పర్యాటకులు తమ వాహనాలను రోడ్ల పక్కనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వెహికిల్స్ సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read Also: Extreme Cold in Telangana: తెలంగాణపై చలి పంజా.. జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు

ఇక, ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటం మా లక్ష్యం.. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించామని ఎస్పీ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సుమారు 300 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఉత్తరాఖండ్‌లోని హిల్ స్టేషన్‌లలో జనం భారీగా తరలి వస్తున్నారు. నైనిటాల్, కౌసాని, లాన్స్‌డౌన్, ముస్సోరీ, ధనౌల్తితో పాటు ఔలి నుంచి పర్యాటక ప్రదేశాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. డిసెంబర్ 31తో పాటు జనవరి 1కి ఔలిలోని అన్ని హోటళ్ల బుకింగ్‌లు దాదాపు పూర్తి అయ్యాయి. నైనిటాల్‌లో కూడా 70 శాతానికి పైగా హోటళ్ల బుకింగ్ పూర్తైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం నిరంతరం ఏర్పాట్లు చేస్తోంది.