Site icon NTV Telugu

Real Friendship: కొంగతో కుర్రాడి స్నేహానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

Real Friend

Real Friend

Real Friendship: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అలాగే ఓ వ్యక్తి కొంగ స్నేహ భావం చూసిన నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. రియల్ ఫ్రెండ్ షిప్ అంటూ కితాబిస్తున్నారు. ఈ ఆత్మీయ స్నేహం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందినది. ఔరంగాబాద్‌లోని గౌరీగంజ్ గ్రామం మాండ్‌ఖా మజ్రేలో నివసిస్తున్న ఒక వ్యక్తికి కొంగతో ఎంత బలమైన స్నేహం ఏర్పడింది. మహ్మద్ ఆరిఫ్ పొలాల్లో గాయాలో పడి ఉన్న కొంగను పొలాల్లో చూశాడు. దాని కాలు విరిగి ఉండడంతో తన ఇంటికి తీసుకొచ్చాడు. దానికి చికిత్స చేసిన ఆహారం అందించాడు. అనంతరం దానిని అడవి ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్లాడు.

Read Also: 30Kg Tumor : రోగి కడుపులో 30కేజీల కణతి.. ఆపరేషన్‎కు ఆరుగంటలు

కానీ, ఆ పక్షి అడవి వైపు వెళ్లకుండా ఆరీఫ్ దగ్గరే ఉండిపోయింది. ప్రస్తుతం వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అరిఫ్ బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నా కొంగ కూడా అతడిని అనుసరిస్తూ వెళ్తుంటుంది. వారి స్నేహానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఫిబ్రవరి 22న ‘జ్ఞానేంద్ర శుక్లా’ (@gyanu999) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘జ్ఞానేంద్ర’ పోస్ట్ చేసిన వీడియోకి ఇప్పటి వరకు 78k కంటే ఎక్కువ లైక్స్, దాదాపు 1700 లైక్‌లు వచ్చాయి. అలాగే, ఈ స్నేహాన్ని చూసి, చాలా మంది నెటిజన్లు తమ మనసులోని మాటలను కామెంట్ల రూపంలో రాశారు. చాలా అందమైన వీడియో అని ఒకరు… ద్వేషపూరిత వాతావరణంలో ఇటువంటి దృశ్యాలు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తామని మరొకరు కామెంట్ చేశారు. అదే సమయంలో మరొక వ్యక్తి – పక్షులు కూడా ప్రేమ భాషను మనుషుల కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాయని పేర్కొన్నారు.

Exit mobile version