NTV Telugu Site icon

Verity Eating Habbit : ఇదేం అలవాటు.. పరుపులను పూరీల్లా తింటున్న మహిళ

American Young Woman

American Young Woman

Verity Eating Habbit : జిహ్వకో రుచి పుర్రెకో ఆలోచన అన్న సామెత వినే ఉంటారు. అదే విధంగా చాలా మందికి వింత వింత అలవాట్లు ఉంటాయి. కొందరు పెయింట్, గ్యాసోలిన్, జిగురు వాసనను ఇష్టపడతారు. కాగితాలు, మట్టి, చాక్ పీసులను తింటుంటారు. అలాంటి అలవాట్లు సాధారణంగా హానిచేయవు.. మరోకరి ఆరోగ్యానికి వాటి వల్ల ఎటువంటి ముప్పు ఉండదు. అయితే, కొన్ని అలవాట్లు హద్దులు దాటినప్పుడు, సమస్యలు తలెత్తుతాయి. అవి వారి పాలిట వ్యసనంగా మారతాయి. జెన్నిఫర్ అనే మహిళకు అలాంటి వింత అలవాటు ఉంది.

అమెరికాకు చెందిన జెన్నిఫర్‌కు పరుపులు, కారు సీట్లు తినడం అలవాటు. రానురాను ఇప్పుడు ఆమె దానికి బానిస అయ్యింది. అమెరికన్ మీడియాలో ‘మై స్ట్రేంజ్ అడిక్షన్’లో గెస్ట్‌గా కనిపించిన జెన్నిఫర్, పరుపులు తినే వింత అలవాటు గురించి వివరంగా మాట్లాడింది. తాను రెండు దశాబ్దాలుగా పరుపులు తింటున్నట్లు వెల్లడించింది. ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పుడే అలవాటు ప్రారంభమైంది, ఆమె వారి ఇంట్లో కార్ సీట్ల నుండి స్పాంజ్లు తినడం ప్రారంభించినట్లు తెలిపింది.

Read Also: K.Raghavendra Rao: డిజిటల్ బాట పట్టిన రాఘవేంద్రుడు.. ఆరంభించిన దర్శకధీరుడు

తాను ప్రతిరోజూ ఒక చదరపు అడుగు పరుపు తినగలనని జెన్నిఫర్ పేర్కొంది. జెన్నిఫర్ mattress మొత్తం అయిపోవడం.. లేదా mattress నుంచి దుర్వాసన వచ్చినప్పుడు మాత్రమే తినడం ఆపుతానంటుంది. జెన్నిఫర్ ఒక రోజు తన సొంత పరుపు మొత్తం తిన్నానని.. అనంతరం తన తల్లి పరుపు తినడం మొదలుపెట్టడంతో విషయం బయటపడిందని తెలిపింది.

తనకు తిండి పిచ్చి ఎక్కువగా ఉందని.. కానీ ఆ క్రమంలో వేరే ఆహారం తీసుకోకుండా mattressనే తింటానంది. ఇప్పటి వరకు తన అలవాటు వల్ల ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదని జెన్నిఫర్ చెప్పింది. అయితే, పరుపులు తిన్న తర్వాత తనకు గ్యాస్ సమస్యలు వస్తాయని ఆమె అంగీకరించింది. మెట్రెస్ తిన్న తర్వాత జెన్నిఫర్ టాయిలెట్‌ని ఉపయోగించడం వల్ల టాయిలెట్ పైపు బ్లాక్ అయిపోందని చెప్పింది.

Read Also:KotamReddy Sridhar Reddy: నమ్మకద్రోహం మాటకు బాధేసింది

అదే ఇప్పుడు ఇంటి వారికి ఇబ్బందిగా మారింది. కానీ జెన్నిఫర్‌ని పరీక్షించిన వైద్యుడు.. mattress తినడం మానేయకపోతే, ఆమె ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని.. ఆమె కాలేయం, ప్రేగులకు ప్రమాదం ఏర్పడుతుందని, ఇది ఆమె మరణానికి దారితీస్తుందని హెచ్చరించాడు. ఇది విని ఆశ్చర్యపోయిన జెన్నిఫర్ ఇప్పుడు తన అలవాటును వదులుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. డాక్టర్ హెచ్చరికల నేపథ్యంలో జెన్నిఫర్ కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది.