Site icon NTV Telugu

Telangana: రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకొచ్చిన అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం

D. Sridhar Babu

D. Sridhar Babu

Telangana: అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం నాడు మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు. వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణరంగ పరికరాలను ఉత్పత్తి చేస్తుందని శ్రీధర్ బాబు వివరించారు.

Read Also: Registrations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా స్తంభించిన రిజిస్ట్రేషన్లు

రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని అన్నారు. అనంతరం తెలంగాణలో పెట్టుబడులకు అంగీకరించిందని మంత్రి తెలిపారు. డేటా ట్రాన్స్‌మిషన్, నెట్ వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ గ్లోబల్ లీడర్‌గా ఉంది. ఇప్పుడా కంపెనీ పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరత లేదని వెల్లడించారు. సమావేశంలో పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు, డైరెక్టర్ నమ్యుత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం, మైక్రోటెక్ గ్లోబల్ ప్రతినిధులు డెనిస్ మొటావా,సియాన్ ఫిలిప్స్, జో జోగ్భి, అశోక్ పెర్సోత్తమ్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version