Corona Spray : చైనాలో పుట్టిన కరోనా యావత్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. ప్రాణాలు పోయాయి.. ఉద్యోగాలు ఊడాయి.. పరిశ్రమలు మూతబడ్డాయి. మహమ్మారి పీడి విరగడైంది అనుకున్నప్పుడల్లా తన రూపాన్ని మార్చుకుంటూ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారిని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.అసలు వ్యాక్సిన్ లేని రోజుల నుంచి.. కొత్త వాటిని తయారు చేసేవరకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ల తయారీలో మార్పులు వస్తున్నాయి.ఈ క్రమంలో అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా మరో కొత్త ఆవిష్కరణ చేశారు.అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్లు కరోనాను నిరోధించే స్ప్రేని తయారు చేశారు.
Read Also: Good News: ఇక ప్రతీ ఇంట్లో పప్పు ఉడుకుతుంది
‘ఫేస్2’గా వ్యవహరిస్తున్న ఈ ‘సుప్రామాలిక్యులార్ ఫిలమెంట్ మాలిక్యూల్స్’ను సింపుల్‌గా ముక్కులోకి లేదా నోట్లోకి స్ర్పే చేయవచ్చని వారు వివరించారు. ఈ మాలిక్యూల్ ఫిలమెంట్లు స్పాంజిలాగా పనిచేసి.. ముక్కులోకి ప్రవేశించిన కరోనా, ఇతర వైర్‌సలు మన కణాలకు అతుక్కునే లోపే వాటిని తమవైపు ఆకర్షించి, బంధించివేస్తాయని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఇంజనీర్ ఒకరు తెలిపారు. ఒక్కసారి ముక్కులోకి స్ప్రే చేస్తే.. దాని ప్రభావం గంట నుంచి రెండు గంటల దాకా ఉంటుందని, జనం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లేటప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
Read Also: Mohan Lal : రోడ్డుపై కాగితాలు ఏరుతున్న సూపర్ స్టార్ మోహన్ లాల్
ఇప్పటికే ఎలుకలపై నాజిల్ స్ప్రే విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. కరోనా వైరస్ మొదటగా ఊపిరితిత్తుల కణాలలో ఉండే AS2 అని పిలువబడే గ్రాహకంలోకి చొచ్చుకుపోతుంది. అది కణంలోకి ప్రవేశించి విస్తరిస్తుంది. ఇటీవల అభివృద్ధి చేసిన SMFలు తంతువులలో ఇలాంటి సూడో-రిసెప్టర్‌లను కలిగి ఉన్నాయి. వారు తమను తాము కరోనా వైరస్‌లోకి ఆకర్షిస్తారు మరియు అక్కడే ఉంటారు. ఇది కరోనా వైరస్ యొక్క అన్ని రకాలను సమర్థవంతంగా నిరోధిస్తుందని పరిశోధకులు అంటున్నారు.