NTV Telugu Site icon

American Airlines : విమానంలో అలాంటి పని చేసిన మహిళకు రూ.68లక్షల జరిమానా

New Project (95)

New Project (95)

American Airlines : విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ మహిళకు భారీ జరిమానా విధించింది. 2021వ సంవత్సరంలో ఓ మహిళ విమానంలో తప్పతాగి తోటి ప్రయాణికులపై దాడి చేసినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 81,950డాలర్ల అంటే రూ. 68 లక్షల 46 వేలకు పైగా జరిమానా విధించింది. అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ జరిమానాను ఆమె చెల్లించలేదు. దీంతో ఆమెపై కేసు పెట్టింది.

Read Also:Ramcharan : క్లింకారా కు తినిపిస్తుంటే నాలో సూపర్ పవర్స్ వచ్చేస్తాయి..

2021వ సంవత్సరంలో 34 ఏళ్ల హీథర్ వెల్స్ అనే మహిళ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అల్లకల్లోలం సృష్టించింది. శాన్ ఆంటోనియో నివాసి అయిన హీథర్ వెల్స్ జూలై 7, 2021న టెక్సాస్ నుండి షార్లెట్‌కి వెళ్లే విమానంలో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ సమయంలో ఆమె విస్కీని ఆర్డర్ చేసింది. అది తాగిన తర్వాత ఆమె తప్పుగా ప్రవర్తించింది. ఆమె విమానంలో ప్రయాణిస్తున్న సమయంతో ఇతర ప్రయాణికులు, సిబ్బందితో గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా వారిపై ఉమ్మి వేసింది. అంతేకాదు విమానం మధ్యలో ఉన్న ప్రధాన గేటును కూడా తెరవడానికి ప్రయత్నించింది. చివరికి, సిబ్బందితో సహా ప్రయాణికులు హీథర్‌ను పట్టుకుని టేప్ సహాయంతో సీటుకు కట్టేశారు. ఆమె చర్యలకు ప్రస్తుతం రూ.68 లక్షలకు పైగా జరిమానా విధించారు. ఇది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విధించిన అత్యధిక జరిమానా.

Read Also:Ecuador Rains : ఈక్వెడార్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి.. 30మంది గల్లంతు

విస్కీ తాగిన తర్వాత హీథర్ ఫ్లైట్ నుండి బయటకు వెళ్లాలని పట్టుబట్టి పరుగెత్తడం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమె ఫ్లైట్‌లో కూర్చున్న ఇతర ప్రయాణికులతో కూడా అసభ్యంగా మాట్లాడింది. ఫ్లైట్‌లోనే క్రాల్ చేయడం ప్రారంభించింది. ఆమె చర్యలను ఆపడానికి ఒక ఫ్లైట్ అటెండెంట్ ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె అతన్ని కొట్టింది. వారిని నెట్టడం ప్రారంభించింది. దీని కారణంగా విమాన సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. సీటుపై టేప్‌తో కట్టేసిన తర్వాత కూడా ఆమె శాంతించలేదు. దాడిని కొనసాగించి. ఆమె ముందు ఉన్న సీటును విరగగొట్టింది. ఆ తర్వాత ఆమెను మొదట అపస్మారక స్థితికి తీసుకుని వచ్చి. తర్వాత విమానం నుంచి దించేశారు.