Site icon NTV Telugu

US: వామ్మో ఏం గాలి.. ఓ విమానం ఏమైందంటే..!

Videro

Videro

పంచభూతాలు మనిషికి ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదం కూడా. మనిషికి భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి చాలా అవసరం. ఇవి ఉంటునే మనుగడ ఉంటుంది. ఇవి మనిషి జీవనాన్ని శాసిస్తాయి. గాలి కావల్సినంత ఉంటేనే క్షేమం. లేదంటే మనిషి ప్రాణాలను కూడా తీస్తుంది. ఇక అమెరికాలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: RudraM-2 Missile: రుద్రఎమ్-2 క్షిపణి పరీక్ష విజయవంతం.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా?

అమెరికాలోని టెక్సాస్‌లో మంగళవారం భారీ స్థాయిలో గాలులు వీచాయి. దీంతో పార్కింగ్‌లో ఉన్న ఓ బోయింగ్‌ విమానం చక్రం తిరిగినట్టుగా తిరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్‌ 737-800 విమానం పార్కింగ్‌లో ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా కదిలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఇది రికార్డ్ అయింది. మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో గేట్‌ సీ21 దగ్గర ఈ ఘటన చోటుచేసుకొంది. ఆ సమయంలో దాదాపు గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ దెబ్బకు దాదాపు 202 విమానాలను రద్దు చేయగా.. మరో 500 విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. గాలి ధాటికి విమానం ఏమైందో మీరే చూడండి.

ఇది కూడా చదవండి: PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version