Site icon NTV Telugu

Ameesha patel : గదర్ 2 సినిమా నిర్మాణ సంస్థ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమీషా..

Whatsapp Image 2023 06 30 At 9.41.04 Pm

Whatsapp Image 2023 06 30 At 9.41.04 Pm

అమీషా పటేల్ ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో చాలా సినిమాలు చేసింది హీరోయిన్ అమీషా పటేల్. హిందీ మరియు తెలుగులో ఒకేసారి తన కెరీర్ ను మొదలు పెట్టింది..తెలుగులో అప్పట్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. పంజాబీ సినిమాలలో కూడా నటించింది ఈ భామ… తాజాగా గదర్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది.అయితే ఇటీవలే గదర్‌-2 మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న భామ చిత్ర యూనిట్‌పై షాకింగ్ కామెంట్స్ ను చేసింది. మే నెల చివర్లో జరిగిన గదర్-2 షూటింగ్‌లో నిర్మాణ సంస్థ తీరు పట్ల అమీషా పటేల్ వరుస కామెంట్స్ చేసింది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్‌ తమకు ఆహారం, వసతి మరియు రవాణా కోసం ఎలాంటి బిల్లులను చెల్లించలేదని ఆరోపించింది. ఆ సమయంలో తాము పడిన కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

అమీషా కామెంట్స్ చేస్తూ..మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర సిబ్బందికి వేతన బకాయిలు కూడా చెల్లించలేదు. షూటింగ్ చివరి రోజున చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు అలాగే ఆహార బిల్లులకు కూడా డబ్బులు చెల్లించలేదనీ తెలిపింది.నటీనటులు మరియు సిబ్బందికి కార్లు కూడా సమకూర్చలేదు. అక్కడే ఒంటరిగా మమ్మల్ని వదిలిలేశారు. కానీ వెంటనే జీ స్టూడియోస్ వారు రంగంలోకి దిగి అన్ని బకాయిలను చెల్లించారు. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ చేసిన తప్పులను వాళ్లు సరి చేసారు.. గదర్ 2 సినిమాను అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోందని అందరికీ తెలుసు. ఈ సమస్యను పరిష్కరించిన షరీక్ పటేల్, నీరజ్ జోషి, కబీర్ ఘోష్ మరియు నిశ్చిత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. జీ స్టూడియోస్ టీమ్ ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటుంది.’ అంటూ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ పై అనిల్ ప్రొడక్షన్స్ ఎలాంటి బదులు ఇస్తారో చూడాలి.

Exit mobile version