Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ప్రిస్టిన్ కేర్ zoi హాస్పిటలో డ్రగ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఈ ఆసుపత్రిలో ఓ పాత నేరస్థుడు ఆసిఫ్ డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. 2024లో ఆసిఫ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్‌లో ముంబై నుంచి mdma డ్రగ్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 2025 మేలో బెయిల్ పైన బయటకు వచ్చాడు నేరస్థుడు ఆసిఫ్.. ఈజీ మనీకి అలవాటు పడి, డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. తాజాగా అమీర్‌పేట్‌లోని ప్రిస్టిన్ కేర్ జోయ్ హాస్పిటల్‌లోని కెఫెటేరియాలో చేరాడు. గుజరాత్ లోని తన స్నేహితుడు మూసాను mdma డ్రగ్ కొరియర్‌లో పంపాలని కోరాడు.
READ MORE: Spirit Movie : బాహుబలి, కేజీఎఫ్ లైన్‌లో ‘స్పిరిట్’ – వంగా మాస్టర్ ప్లాన్
10 గ్రాముల mdma డ్రగ్‌ను ఆసిఫ్‌కు ఫ్రెండ్ మూసా కొరియర్ చేశాడు. 10 గ్రాముల డ్రగ్‌లో ఇప్పటికే 5 గ్రాములు తీసుకున్నాడు ఆసిఫ్.. మిగిలిన 5 గ్రాముల mdma డ్రగ్‌ను విక్రయిస్తుండగా ఈగల్ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆసుపత్రిలోనే కొంతమంది సిబ్బందికి డ్రగ్‌ను అమ్మినట్టుగా టీం అనుమానిస్తోంది. ఆసిఫ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసిఫ్ నుంచి ఐదు గ్రాముల MDMAని, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ డేటా ఆధారంగా కన్జ్యూమర్ల లిస్టుని సేకరిస్తున్నారు. తమ ఆసుపత్రితో ఎలాంటి సంబంధం లేదంటూ హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. కెఫెటేరియాను థార్డ్ పార్టీకి లీజుకు ఇచ్చామని చెబుతున్నారు.
