NTV Telugu Site icon

Kishan Reddy : కిషన్‌రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు షురూ..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : స్థానిక పార్లమెంట్ సభ్యుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పై నేటి నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అంతవరకు సౌకర్యార్థం శివరాత్రి నుంచి ఈ బ్రిడ్జ్ పై రాకపోకలను అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన నిన్న ఫ్లై ఓవర్ పనులను పర్యవేక్షించారు. కేంద్రమంత్రి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ దశాబ్దాల కల. దీనికోసం చాన్నాళ్లుగా స్థానికులు, ఈ మార్గంలో రోజూ ప్రయాణించే వారు ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి చొరవతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడం, శివరాత్రి సందర్భంగా అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నారు.

SECR Recruitment 2025: 10th అర్హతతో.. రైల్వేలో 835 ఉద్యోగాలు.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్!