Site icon NTV Telugu

Ambati Rayudu: “కంటికి కన్ను.. ప్రపంచాన్ని అంధకారం చేస్తుంది”.. అంబటి రాయుడిపై విమర్శలు.!

Ambati Rayudu

Ambati Rayudu

Ambati Rayudu: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో మాజీ క్రికెటర్ ట్వీట్ కలకలం రేపింది. మే 8 (గురువారం) నాడు పాకిస్తాన్ భారతదేశంపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా.. భారత సైన్యం ఆ దాడిని సమర్థంగా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది.

Read Also: PSL: పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు కొనసాగింపు.. కానీ..

రాయుడు ట్విట్టర్‌లో “కంటికి కన్ను.. ప్రపంచాన్ని అంధకారం చేస్తుంది” అనే గాంధీజీ ప్రసిద్ధ వ్యాఖ్యను షేర్ చేశారు. ఇది భారత అభిమానులకు సమంజసంగా అనిపించలేదు. ఎందుకంటే, దాడి మొదట పాకిస్తాన్ నుంచే వచ్చిందని వారు అభిప్రాయ పడుతున్నారు. భారత సైన్యం కేవలం సమర్థ రక్షణ చర్యలే తీసుకుంటోంది అనే అభిప్రాయంతో నెటిజన్లు రాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. ట్వీట్‌ తర్వాత పలువురు యూజర్లు రాయుడును తీవ్రంగా తప్పుబట్టారు. రక్షణ చర్యలు తీసుకోవడం తప్పా? అంటూ పలు ప్రశ్నలను నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ ట్వీట్ దేశభక్తికి వ్యతిరేకంగా ఉందని, రాయుడు సరిగా సమయాన్ని అర్థం చేసుకోలేదని కూడా పలువురు అభిప్రాయపడ్డారు.

https://twitter.com/RayuduAmbati/status/1920522427253092392

ఈ తీవ్ర విమర్శల నేపథ్యంలో, రాయుడు తన ట్వీట్‌ను తొలగించకపోయినా.. కొన్ని గంటల తర్వాత శాంతిని కోరుతూ మరో ట్వీట్ చేశారు. ఇందులో “జమ్ము కాశ్మీర్, పంజాబ్, భారత సరిహద్దుల్లో.. శాంతి, భద్రత కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత ఇంకా త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్!.” అంటూ రాసుకొచ్చారు. అయితే, ఈ ట్వీట్ కూడా నెటిజన్లకు ఆశించిన స్థాయిలో సంతృప్తి కలిగించలేదు. దాన్ని “డ్యామేజ్ కంట్రోల్”గా కొంతమంది పేర్కొన్నారు.

Exit mobile version