NTV Telugu Site icon

Ambati Rayudu: ఐపీఎల్లో అతనే నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

Rayudu

Rayudu

Ambati Rayudu: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్ల హోరు, బౌలర్ల జోరుతో సీజన్ ఆదినుంచే మొదలయ్యింది. ఇక ఆర్ఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మరో మరు ఐపీఎల్ లో తన మార్క్ బ్యాటింగ్ చూపించి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. గ్రౌండ్ లో ఇలా ఉండగా.. ఆటగాళ్ల గురించి, మ్యాచుల గురించి మ్యాచ్ చూస్తున్న అభిమానులకు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు తమ విశ్లేషలను అందిస్తూ మంచి మజానిస్తున్నారు.

Read Also: Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ విడుదల.. ధర తక్కువే

ఈ నేపథ్యంలోనే అన్ని ఫార్మట్స్ కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం కామెంటేటర్ గా రాణిస్తోన్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ పేరు తెలిపాడు. తన క్రికెట్ కెరీర్ లో స్పిన్నర్ సునీల్ నరైన్ వల్ల ఇబ్బంది పడినట్లు చెప్పాడు. తనకు అతి కష్టమైన మిస్టరీ స్పిన్నర్ అతడే అంటూ పేర్కొన్నాడు. తనని బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ సునీల్ నరైన్, అయన బౌలింగ్ ఎదుర్కోవడం సవాల్ గా ఉండేదని తెలిపాడు. నరైన్ బౌలింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు. తాను సహజంగా, స్వేచ్ఛగా క్రికెట్ ఆడే సమయంలో ఏదో విధంగా నరైన్ బౌలింగ్‌ను అంచనా వేయడం నాకు సాధ్యమయ్యేది కాదని చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడైనా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు వేసిన బంతి ఎప్పుడూ ఊహించిని విధంగా తిరిగేదని పేర్కొన్నాడు.