Ambati Rayudu: ఏదీ అవసరం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన అంబటి రాయుడు!
- ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలం
- రాయుడుకి స్థలాన్ని కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి
- తిరస్కరించిన అంబటి రాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rayudu declines BRS MLA Padi Kaushik Reddy’s Request: షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ కేబినెట్ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అంతేకాదు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు.. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా హైదరాబాద్‌లో ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తెలంగాణ ప్రభుత్వంకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యర్థనపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. ఎమ్మెల్యే చేసిన అభ్యర్థనపై హర్షం వ్యక్తం చేసిన రాయడు.. తనకు ఎలాంటి ఇంటి స్థలం అక్కర్లేదన్నారు. ‘కౌశిక్ రెడ్డి గారూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. భారత క్రికెట్‌కు మొహమ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ ప్రభుత్వంను ఏమీ అడగలేదు, ఆశించలేదు. అన్ని క్రీడలు మరియు క్రీడాకారులకు సమానంగా మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మద్దతు చాలా అవసరం’ అని రాయడు పేర్కొన్నారు.
Also Read
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
Also Read: Neeraj Chopra-Visa: నీరజ్ చోప్రా ‘గోల్డ్’ కొడితే.. ప్రపంచంలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు!
‘క్రికెటర్లుగా మేం ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలం. ఈ విషయంలో మేము అదృష్టవంతులం. నాకు భూమిని కేటాయించమని ప్రభుత్వానికి మీరు చేసిన అభ్యర్థనను నేను గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నాను. నిజంగా ఆ అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నా’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!