Site icon NTV Telugu

Ambati Rambabu: “చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబు దిట్ట”.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..

Ambatirambabu

Ambatirambabu

చంద్రబాబును మించిన క్రిమినల్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరూ లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరన్నారు. మద్యం కేసులో ఎంతమందిని అరెస్టు చేసినా లెక్క చేయమని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీని అణచి వేయలేరన్నారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. అలాంటి వారికే ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలకు జనం విస్తుపోతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తారని ప్రజలు కూటమిని గెలిపించారు.. కానీ రాజకీయ కక్షసాధింపులు, వైసీపి నేతలు, కార్యకర్తలను వేధించే పని చేస్తున్నారని మండిపడ్డారు.

READ MORE: Bitra island: “బిట్రా ద్వీపం”లో మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. నేరుగా పాక్, చైనాలపై గురి..

“చివరికి జగన్ పర్యటనలకు వెళ్తే ఆయనపై కూడా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు పేరుతో ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీని తెచ్చింది. ప్రయివేటు వ్యక్తులకు ప్రమేయం లేకుండా చేశాం. దీని వలన ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ పాలసీలో తప్పులేదని కేంద్ర సంస్థ సీసీఐ కూడా చెప్పింది. కానీ సీసీఐని తీర్పును కూడా కాదని అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే మద్యం అక్రమాలు జరిగాయి. ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. స్కిల్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు ఎప్పటినుంచో కక్ష ఉంది. అందుకే మిథున్‌రెడ్డి మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేయటమే‌ సిట్ అధికారుల పనిగా ఉంది. ఎవరిని కేసులో పెట్టమని చెబితే వారిని అరెస్టు చేస్తున్నారు. లేని స్కాంను ఉన్నట్లు చూపుతూ పుస్తకాలు, నవలలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న హోంమంత్రి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అవేమీ పట్టించుకోకుండా రాజకీయ వేధింపుల పనిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు మేము భయపడం. అవసరమైతే కొన్నాళ్ళు జైల్లో ఉండానికైనా సిద్ధం. అసలు మద్యం కేసులో మిథున్ రెడ్డి కి ఏం సంబంధం? డబ్బుతో ఏదైనా చేయగలని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరు. చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టిలరీ నుండే గత ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. చంద్రబాబు పెట్టిస్తున్న ఏ ఒక్క కేసు కూడా నిలపడదు” అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Exit mobile version