తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల కోసం రాజానగరం నియోజకవర్గంకు రావడం చాలా ఆనందంగా ఉంది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిన్న మొన్నటి దాక సెంట్రల్ జైల్ లో ఉండి ఆరోగ్యం బాగా లేదనే సాకుతో బయటకు వచ్చి మమ్మల్ని ఓడిస్తాడా.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన.. చంద్రబాబు టికెట్లు వేస్తే ఫ్లైట్ ఎక్కేది పవన్ కళ్యాణ్.. నారా లోకేశ్ పాదయాత్ర చేసినా దూకుడు యాత్ర చేసిన ఎప్పటికీ నాయకుడు కాలేడు అంటూ ఆయన విమర్శించారు. సోదరులకు సౌదరులు అని పిలిచే వ్యక్తి ఎమ్మేల్యే ఎలా అవుతాడు.. తెలంగాణ రాష్ట్రంలో గ్లాసు గుర్తుపై ఎనిమిది సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే చంద్రబాబు కాంగ్రెస్ కు ఓటు వెయ్యమంటున్నాడు.. ఆంధ్రాలో మాత్రం తెలుగుదేశానికి ఓటు వెయ్యమనడం నీతి, సిగ్గులేని రాజకీయం అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
Read Also: India at UN: ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా యూఎన్‌లో భారత్ ఓటు..
దుష్ట శక్తులంతా పిట్టల దొరల్లా డప్పులు వాయిస్తూ తిరిగినా.. ఎంత మంది కలిసి వచ్చినా జగన్మోహనరెడ్డిని ఓడించే నాయుకుడు లేరు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఇది పేదవాళ్లుకు పెత్తందార్లుకు జరుగుతున్న యుద్ధం.. ఈ యుద్దములో పేదవాల్లదే విజయం, జగన్మోహన రెడ్డిదే విజయం.. ప్రస్తుతం రాజా శాసనసభ్యుడు.. భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి కరుణిస్తే రేపు ఎన్నికల తరువాత ఏమైనా కావచ్చు అని ఆయన పేర్కొన్నారు. నేను, జక్కంపూడి కుటుంభం జగనన్నను నమ్ముకున్న వ్యక్తులం.. మేము చచ్చేంత వరకూ జగనన్నతోనే మా ప్రయాణం.. వందల అభివృద్ది కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.. పల్లకి మోయడానికి పవన్ సిద్ధంగా ఉన్నా కాపులు సిద్ధంగా లేరు అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.