Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Case: డీఎస్సీ అక్రమాలపై విజయవాడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా విజయవాడ బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును‌ కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు‌ ఆందోళనకు దిగారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది.

వైసీపీ నేతలు‌ నూరిఫాతిమా, డైమండ్ బాబు, అంబటి మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న సత్తెనపల్లి వైసీపీ ఇన్ ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిపై విజయవాడ మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. సుధీర్ భార్గవ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు నర్సరావుపేట వచ్చారు. అయితే సుధీర్ భార్గవరెడ్డి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులతో భార్గవ రెడ్డి ఆచూకీ గురించి ప్రశ్నించారు.

శాప్ కార్యాలయం ముట్టడి కేసులో సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పోలీసు స్టేషన్లలో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాచవరం, కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలోనే వైసీపీ నేతలపై రెండు కేసులు నమోదు అయ్యాయి. మాచవరం పోలీసు స్టేషన్లో శాప్ డైరెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 221,223,127,132,189 109(1) of BNS and sec 3(2) (v) of sc st act R/w 190 కేసులు నమోదు చేసిన మాచవరం పోలీసులు. మాచవరం పోలీసు స్టేషన్లో డీఎస్సీ అభ్యర్థి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 221, 223, 285, 127(2), 132, 189(3) BNS SC/ST (POA) Act, 1989లోని సెక్షన్ 3(1)(s) r/w 190 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. సూర్యారావుపేట పోలీసుల స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిరసన ర్యాలీ నిర్వహించారని 250 మంది వైసీపీ నేతలపై సూర్యారావు పేట ఎస్సై కంప్లైంట్ ఇచ్చారు.