Amazon Republic Day Sale 2024 Dates and Price in India: సంక్రాంతి పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. భారీ ఆఫర్లతో సేల్‌కు సిద్ధమైంది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ 2024ను తాజాగా అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమై.. జనవరి 17 వరకు కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటలు ముందుగానే ఈ సేల్ మొదలుకానుంది. అంటే జనవరి 13న ఉదయం 12 గంటలకు డీల్‌లను ప్రైమ్ మెంబర్స్ యాక్సెస్ చేయవచ్చు. ప్రైమ్ మెంబర్‌ల కోసం ప్రత్యేకంగా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024లో మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్, ల్యాప్ టాప్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు మరియు యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపు.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ వాచ్‌లపై 75% తగ్గింపు.. స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు మరియు ఎయిర్ కండిషనర్స్ వంటి గృహోపకరణాలపై 65% తగ్గింపు పొందవచ్చు. ఇక సేల్ సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ తెలిపింది.
Also Read: IND vs AFG: నేడు భారత్, అఫ్గానిస్థాన్ తొలి టీ20.. కోహ్లీ స్థానంలో తిలక్!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024లో ఐఫోన్ 13 తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 13 ధర రూ. 59,999 కాగా.. ప్రస్తుతం 52,999కే లభిస్తోంది. సేల్‌లో ఈ ధర మరింత తగ్గనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్ 23 ప్లస్ ఫోన్స్ ప్రస్తుతం రూ. 10వేల డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. సేల్ సమయంలో అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ 11, మోటోరొలా రేజర్ 40 అల్ట్రా, రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ, రెడ్‌మీ ఐ 12, లావా బ్లేజ్ 5జీ, ఐకూ 12, ఐకూ Z7 Pro, హానర్ 90 ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. వీటిపై ఎంత డిస్కౌంట్ ఉండనుందో త్వరలో తెలియరానుంది.