NTV Telugu Site icon

Amazon Prime Free: ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇలా చేయండి.. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందండి..

Amazon Prime Video

Amazon Prime Video

Amazon Prime Free for Airtel Users: మిలో ఎవరైనా భారతీ ఎయిర్‌టెల్ సిమ్‌ని ఉపయోగిస్తే, మీరు అనేక ఓటీటీ సేవల సభ్యత్వాన్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. కంపెనీ అటువంటి అనేక ప్లాన్‌లను అందిస్తోంది. వీటితో రీఛార్జ్‌పై అదనపు రుసుము చెల్లించకుండా ఓటీటీ కంటెంట్‌ను చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందుబాటులో ఉన్న ప్లాన్‌ల గురించి చూద్దాం. ఇక్కడ మరో విషయమేమిటంటే.., ఈ ప్లాన్‌లలో రోజువారీ డేటా కూడా ఎక్కువుగా ఇవ్వబడుతుంది. కాలింగ్, డేటా వంటి అవసరాలకు మీరు రీఛార్జ్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, ఓటీటీ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వబడుతున్న ప్లాన్‌ లతో మీరు రీఛార్జ్ చేసుకుంటే మంచిది. ఇది కాకుండా, అర్హులైన సబ్‌స్క్రైబర్‌ లకు ఈ ప్లాన్‌ లతో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత డేటా ప్రయోజనం అందించబడుతుంది. దీని కోసం, ఎయిర్‌టెల్ యొక్క 5G సేవలు వారి ప్రాంతంలో అందుబాటులో ఉండాలి. అలాగే వినియోగదారులు తప్పనిసరిగా 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి.

ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్..

ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇందులో 3GB రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 SMS పంపే సదుపాయం ఇవ్వబడుతుంది. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌ లలో అపరిమిత కాల్స్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కాకుండా, వినియోగదారులు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌ లను కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ. 1,199 ప్లాన్..

ఒకవేళ మీకు ఎక్కువ వాలిడిటీ కావాలంటే, 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో రీఛార్జ్ చేస్తే మీరు అన్ని( 4g, 5g) నెట్‌వర్క్‌ లలో 2.5GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అలాగే, ప్రతిరోజూ 100 SMSలను పంపవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాకుండా ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే.. అపరిమిత 5G డేటా, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి.

రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ లతో వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వబడుతుంది. దీనితో 22 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్‌ను చూడవచ్చు. వీటిలో SonyLIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi, SunNxt మొదలైనవి ఉన్నాయి.

Show comments