NTV Telugu Site icon

Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’.. ఈ క్రెడిట్ కార్డుపై భారీ క్యాష్‌బ్యాక్!

Amazon Pay Icici Bank Credit Card

Amazon Pay Icici Bank Credit Card

Amazon Prime Day Sale 2023 Offers on Amazon Pay ICICI Bank Credit Card: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ప్రతీ ఏటా రెండు రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ (Amazon Prime Day Sale 2023). ఈ ఏడాది జూలై 15, 16 తేదీల్లో భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఈ సేల్‌లో అమెజాన్‌లో లభించే అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ లభించనుంది. దాంతో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ పండగ చేసుకోనున్నారు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ 2023లో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ క్రెడిట్ కార్డులపై కూడా భారీగా లాభపడనున్నారు. కేవలం ప్రైమ్ మెంబర్స్‌కి మాత్రమే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ (Amazon Pay ICICI Credit Card) అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ కలిసి ‘అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్’ను లాంఛ్ చేశాయి. అమెజాన్‌లో తరచూ షాపింగ్ చేసేవారికి అదనంగా డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ అందించడం కోసం ప్రత్యేకంగా ఇష్యూ చేసిన క్రెడిట్ కార్డ్ ఇది. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. దీనికి జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఛార్జీలు ఉండవు.

Also Read: Ola Electric Bike Range: సరికొత్త ఓలా ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 350కిమీ ప్రయాణం!

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ 2023లో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‘అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్’తో షాపింగ్ చేస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. ఈ క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో యాడ్ అవుతుంది. అమెజాన్‌లో బిల్ పేమెంట్స్, రీఛార్జెస్ చేసినా, డబ్బులు యాడ్ చేసినా 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ పే ద్వారా పేమెంట్స్ చేస్తే 2 శాతం, కార్డుతో ఇతర పేమెంట్స్ చేస్తే 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాదు 1 శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జీ మినహాయింపు ఉంటుంది. ఇక పార్ట్‌నర్ రెస్టారెంట్లలో డైనింగ్ బిల్ చేస్తే.. కనీసం 15 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కొత్తగా తీసుకున్నవారికి రూ. 2,500 విలువైన రివార్డ్స్ వస్తాయి. రూ. 2,500 వెల్‌కమ్ రివార్డ్స్‌తో పాటు 3 నెలల ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా పొందొచ్చు. వీడియో కేవైసీ అప్లికేషన్ ద్వారా ఈ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేస్తోంది. అమెజాన్‌లో మొదటి షాపింగ్ లేదా మొదటి బిల్ పేమెంట్ చేస్తే రూ. 300, అమెజాన్‌లో షాపింగ్ చేస్తే 25 శాతం లేదా రూ. 200 పొందొచ్చు. ప్రీపెయిడ్ రీఛార్జెస్, గ్యాస్ సిలిండర్ పేమెంట్‌, డీటీహెచ్ రీఛార్జ్‌, బ్రాడ్‌బ్యాండ్ బిల్ పేమెంట్‌ లాంటి వాటిపై కూడా క్యాష్‌బ్యాక్ వస్తుంది.

Also Read: Mohammed Siraj Catch: డైవింగ్ చేస్తూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! సిరాజ్ వీడియో వైరల్