NTV Telugu Site icon

Amazon Great Freedom Festival Sale 2023: అమెజాన్‌‌లో ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌.. తేదీ, ఆఫర్ల వివరాలు ఇవే!

Amazon

Amazon

Amazon Great Freedom Festival Sale 2023 Starts from August 5 in India: ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను త్వరలోనే నిర్వహించబోతోంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటించనుందని సమాచారం తెలుస్తోంది. ప్రతీ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెజాన్ ఇండియా.. ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌ని నిర్వహిస్తుంటుంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 పూర్తయిన విషయం తెలిసిందే.

అమెజాన్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌ 2023లో ప్రైమ్‌ కస్టమర్లు 12 గంటలు ముందుగానే ఆఫర్లను పొందవచ్చు. ప్రైమ్ లేని వారికి ఈ ఆఫర్లు 12 గంటలు లేటుగా వర్తిస్తాయి. దాంతో వారికి ఆఫర్స్ దక్కే అవకాశాలు తగ్గనున్నాయని తెలుస్తోంది. ఈ ఫ్రీడమ్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఎత్తున ఆఫర్లు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ మీ, వన్ ప్లస్, శాంసంగ్, రెడ్ మీ ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయట. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం దాకా డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. అయితే 5G స్మార్ట్‌ఫోన్‌లపై ఇంత డిస్కౌంట్ ఉండకపోవచ్చని సమాచారం.

ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇయర్‌ బడ్స్‌ లాంటి వాటిని కూడా అమెజాన్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌లో తక్కువ ధరకు అమ్మబోతున్నట్లు అమెజాన్ తెలిపింది. అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నదీ అమెజాన్ ప్రకటించలేదు. ఏదైనా వస్తువు కొనుక్కునే వారు ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఉంది?.. సేల్ ప్రారంభమయ్యాక ఎంత డిస్కౌంట్ ఉంది? అనే వివరాలు తెలుసుకుని కొనుక్కోవచ్చు. దాంతో ఫెస్టివల్ సేల్‌ 2023లో ఎంత డిస్కౌంట్ మనకు వచ్చిందో మనకు ఈజీగా తెలిసిపోతుంది.

Also Read: IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

Also Read: T20 World Cup 2024: జూన్‌లోనే ప్రపంచకప్‌.. ఈసారి సరికొత్తగా!