Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చేరిన అమెజాన్ వ్యవస్థాపకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రేసు రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది దిగ్గజాలు AIపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా చేరారు. గతేడాది ఏఐ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలలో నిలిచిపోయింది. OpenAI ChatGPT తర్వాత, ఇప్పుడు AI పరిధి చాలా విస్తృతమైంది. మరోవైపు, చాలా పెద్ద కంపెనీలు, చాలామంది ధనవంతులు AI పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ జాబితాలో కొత్తగా ఎంట్రీ ఇచ్చారు జెఫ్ బెజోస్ అతడి కంపెనీ చిప్ కంపెనీ ఎన్విడియా.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్ AI స్టార్టప్‌లో భారీ పెట్టుబడి పెట్టారు. జెఫ్ బెజోస్ సెర్చింగ్ పై దృష్టి సారించిన స్టార్టప్ కంపెనీ పెర్ప్లెక్సిటీ ఏఐలో పెట్టుబడి పెట్టారు. ఏఐ ఆధారిత సెర్చింజన్ విషయంలో ఈ కంపెనీ Googleతో పోటీపడగలదు. జెఫ్ బెజోస్‌తో పాటు చిప్ కంపెనీ ఎన్విడియా, ఇతర ఇన్వెస్టర్లు కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు.
Also Read
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
జెఫ్ బెజోస్ మొత్తం నికర విలువ ప్రస్తుతం 170 బిలియన్ డాలర్లు, ఎలోన్ మస్క్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి. దాదాపు 200 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. మస్క్ కూడా AIలో పెట్టుబడి పెట్టాడు. అతను ఇటీవల తన స్వంత ప్రత్యేక AI స్టార్టప్ కంపెనీ X.AIని ప్రారంభించాడు. OpenAI ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ కూడా ఉన్నారు. ఈ స్టార్టప్ కంపెనీ అధునాతన సెర్చింజన్ సాధనాలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. తాజా నిధుల రౌండ్లో కంపెనీ 73.6 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందింది. దీంతో కంపెనీ వాల్యుయేషన్ 520 మిలియన్ డాలర్లకు పెరిగింది. తాజా ఫండింగ్ రౌండ్లో జెఫ్ బెజోస్.. ఎన్విడియా కాకుండా కంపెనీ NEA, డేటాబ్రిక్స్, బెస్సెమర్ వెంచర్ పార్ట్నర్స్ వంటి ఇన్వెస్టర్ల నుండి కూడా నిధులు పొందింది.
ఏడాదిలో 20 రెట్లు వృద్ధి
Perplexity AI ఆగస్టు 2022లో ప్రారంభించబడింది. దీని సహ వ్యవస్థాపకులు అరవింద్ శ్రీనివాస్, డెన్నిస్ యారట్స్, జానీ హో, అండ్ కొన్విన్స్కి. అప్పటి నుండి ఇది చాలా వేగంగా వృద్ధిని కనబరిచింది. కంపెనీ తన సేవలను డిసెంబర్ 2022లో ప్రారంభించింది. ఆ సమయంలో కంపెనీకి కేవలం 2.2 మిలియన్ల మంది వ్యూయర్స్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం డిసెంబర్ 2023 చివరి నాటికి కంపెనీ వెబ్సైట్, మొబైల్ యాప్‌ను సందర్శించే వారి సంఖ్య 45 మిలియన్లకు పెరిగింది.
Read Also:Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మీ ఇల్లు ఎంత బాగుందో చూశారా?.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!