NTV Telugu Site icon

ఏరోస్పేస్ రంగంలో అద్భుత అవకాశాలు: కేటీఆర్‌

KTR

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని.. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదారాబాద్ తాజ్‌కృష్ణలో టాటా బోయింగ్ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. టాటా బోయింగ్ హైదారాబాద్ ఫెసిలిటీలో తయారైన 100 AH-64 అపాచి ఫ్యూస్‌ లైజ్ డెలివరీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ సమయంలోనే ఈ మైల్ స్టోన్ అందుకున్న కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు.

Read Also : తమ్ముడిని ప్రోత్సహించమంటున్న నాగశౌర్య!

ప్రఖ్యాత రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ నిలయమని, ఇక్కడ డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అపార అవకాశాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్ స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఈలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ సెక్టార్‌లో ఏడు డెడికేటెడ్ పారిశ్రామిక పార్కులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. బెంగళూరు కన్నా ఇక్కడ మెరుగైన వసతులున్నాయని.. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా బోయింగ్ ముందుకు రావాలని కేటీఆర్ కోరారు. అదేవిధంగా ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో నైపుణ్య శిక్షణకు తెలంగాణ ప్రభుత్వంతో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు.