NTV Telugu Site icon

Amarnath Yatra: ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. బయల్దేరిన యాత్రికులు

Amarnath

Amarnath

అమర్‌నాథ్ యాత్ర ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హిమాలయాల్లో ఉన్న బోలేనాథుడి ద‌ర్శనం కోసం బాల్టాల్, నునావన్ క్యాంపుల మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. హిమాల‌యాల్లోని ద‌క్షిణ క‌శ్మీర్‌లో సుమారు 3880 మీట‌ర్ల ఎత్తులోని ఓ గుహ‌లో భ‌క్తులు మంచు శివ‌లింగాన్ని ద‌ర్శనం చేసుకోనున్నారు. నువాన్‌-ప‌హ‌ల్గామ్ రూట్లో 48 కిలోమీట‌ర్లు, బ‌ల్తాల్ రూట్లో 14 కిలోమీట‌ర్ల మార్గంలో భ‌క్తులు వెళ్తున్నారు. ఈ రెండూ అమర్‌నాథ్ యాత్రకు మార్గాలు. రెండు మార్గాల్లో యాత్రికుల బృందాలను సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, పోలీసు పరిపాలనలోని సీనియర్ అధికారులు పంపినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఉదయం జమ్మూలోని భగవతి నగర్‌లోని యాత్రి బేసిక్ క్యాంప్ నుండి 4,603 మంది యాత్రికులను జెండా ఊపి పంపించారు. ప్రభుత్వ అధికారులు జెండా ఊపి యాత్రికులకు గుడ్‌ల‌క్ చెప్పారు.

Read Also: Leopard: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం.. బెదిరిపోతున్న భక్తులు..!

ఈ క్రమంలో.. యాత్రికులు మధ్యాహ్నం కాశ్మీర్ లోయకు చేరుకోగా అక్కడ వారికి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు.. ఇతర పారామిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈసారి ఈ యాత్ర నెలన్నర పాటు కొనసాగనుంది. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది.

Read Also: Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం.. గజమాలతో సన్మానం