Site icon NTV Telugu

Amarnath Yatra: వారం ముందే అర్ధంతరంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.? కారణమేంటంటే!

Amarnath Yatra

Amarnath Yatra

Amarnath Yatra: ప్రతి సంవత్సరం లాగే అమరనాథ్ యాత్ర ఈసారి ముందుగా అనుకున్న ముహూర్తాని కంటే వారం ముందు అర్ధంతరంగా ముగిసింది. ఈ నిర్ణయానికి ముఖ్య కారణం వర్షాలు. బలటాల్, పహల్గాం మార్గాలలో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 9న రక్షాబంధన్ నాడు ముగియాల్సిన యాత్రను అధికారుల సూచనలతో ఆగస్టు 3 నుంచే ముగించనున్నారు.

Vivo T4R vs Samsung Galaxy F36: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. వివో T4R vs శాంసంగ్ గెలాక్సీ F36.. ఏది బెస్ట్?

కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి ఈ సమాచారాన్ని అందించారు. ఆయన తెలిపిన వివరాలు మేరకు.. ఇటీవలి భారీ వర్షాల కారణంగా బలటాల్, పహల్గాం మార్గాలపై మరమ్మతులు అత్యవసరంగా చేయాల్సి ఉంది. మార్గాలపై మిషనరీలు, సిబ్బంది నిబంధనల మేరకు పనిచేస్తుండటం వల్ల రేపటి (ఆగష్టు 3) నుంచి యాత్ర కొనసాగించడం సాధ్యపడదు. కాబట్టి ఈ ఏడాది అమరనాథ్ యాత్ర ఆగస్టు 3 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నాం అని తెలిపారు.

71 National Film Awards : జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంత..?

ఇక శ్రీ అమరనాథ్ శ్రైన్ బోర్డు ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షలాది భక్తులు అమరనాథ్ గుహాశ్రయాన్ని దర్శించారన్నారు. మొత్తం 4 లక్షల మంది పుణ్యదర్శనం చేసినట్లు తెలిపారు. అయితే, గత వారం రోజులుగా వాతావరణం, భద్రతా అంశాల కారణంగా యాత్రికుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని అధికారులు తెలిపారు. నిజానికి ప్రభుత్వం ఈసారి యాత్ర కోసం ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం అప్రమత్తతతో 600 అదనపు పారామిలిటరీ కంపెనీలను సెక్యూరిటీగా నియమించారు. ఇప్పటికే ఉన్న భద్రతా వ్యవస్థతో పాటు ఈ అధిక భద్రతా బలగాలు యాత్ర దారుల రక్షణకు పనిచేశాయి

Exit mobile version