Site icon NTV Telugu

మరో 15 రోజుల్లో అమరీందర్‌ సింగ్ కొత్త పార్టీ !

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగలేను.. బీజేపీలో చేరను అని ప్రకటించిన అమరీందర్‌.. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్‌ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కొత్త పార్టీకి.. పంజాబ్‌ వికాస్‌ పార్టీ అని పేరు పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్‌,ఆప్‌, అకాలీదళ్‌ అసంతృప్త నేతలను అమరీందర్‌ కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా… ఇటీవలే కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌..పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version