Site icon NTV Telugu

Amaravati Quantum Valley: అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం

Amaravati Quantum Valley

Amaravati Quantum Valley

Amaravati Quantum Valley: ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని ఓ కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్ లో రెండు వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. గన్నవరంలోని మేధా టవర్స్ తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్‌ లో ఏర్పాటు అవుతున్న 1ఎస్, 1 క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్‌ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటం రిఫరెన్స్‌ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి రానుంది.

Read Also: SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు స్టేట్స్ రైట్స్ మైత్రి మూవీస్ & పీపుల్ మీడియా చేతికి

మేధాటవర్స్ లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్ లు క్వాంటం హార్డ్ వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ లు క్వాంటం ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో 1 ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటం టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ లాంటి సంస్థలు సహకారం అందించాయి. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు…

Exit mobile version