ఏపీలో తమ డిమాండ్ల సాధనకు అమరావతి జేఏసీ ఉద్యమ బాట పట్టింది. మలిదశ ఉద్యమానికి అమరావతి జేఏసీ శ్రీకారం చుట్టింది. కండువాలు ధరించి పోస్టర్లు రిలీజ్ చేసి విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నేతలు. ఉద్యోగుల డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి.పీఆర్సీ,డీఏ బకాయిలపై స్పష్టత ఇవ్వడం లేదు.గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే జీతాలు,పెన్షన్లపై ప్రభుత్వం తప్పు లెక్కలు చెబుతుంది. సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.
Read Also: Rajinikanth: సూపర్ స్టార్ మెచ్చిన సినిమా… ఈ కాంబో సెట్ అయితే ఊచకోతే
ఈనెల 17, 20 తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి మద్దతు కోరతామన్న ఆయన.. ఈ నెల 21వ తేదీన సెల్ డౌన్ యథావిథిగా ఉంటుందన్నారు. 27వ తేదీన కారుణ్య నియామకాలు కోసం వారి కుటుంబం సభ్యులను కలుస్తాం. వచ్చే నెల ఐదో తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ నెల రోజుల అంశాలను మరో సారి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు.. కాగా, 21వ తేదీన సెల్ డౌన్ పేరుతో ప్రభుత్వ యాప్‌లను పనిచేయకుండా నిలిపివేశాలా కార్యాచరణ రూపొందించింది జేఏసీ.8 ఏళ్లుగా ఉద్యోగుల హెల్త్ ను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ చెల్లింపులు సరిగా లేకపోవటం వల్ల వైద్యం నిరాకరణ చేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఏవీ ఇప్పటి వరకు పరిష్కారం అవలేదు.
మలి దశ ఉద్యమంలో భాగంగా 10 వ తేదీన గ్రీవెన్స్ డే రోజున స్పందనలో కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించడం. 11వ తేదీన సెల్ డౌన్ కార్యక్రమం. 12వ తేదీన 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా. 15 వ తేదీన మరణించిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించడం. 18వ తేదీన సిపియస్ ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చేపడతామన్నారు. 20 వ తేదీన జీతాలు సకాలంలో చెల్లించాలని పెనాల్టిల నుంచి విముక్తి కలిగించాలని బ్యాంకుల సందర్శన. 25 వ తేదీన 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ధర్నా ఉంటుందన్నారు. 27వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పరామర్శ కార్యక్రమం ఉంటుందన్నారు. 29 వ తేదీన గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.
Read Also: IPL 2023 : నువ్వా నేనా చూసుకుందాం.. చెన్నైతో ముంబై ఢీ