Site icon NTV Telugu

Amaravathiki Ahwanam: అమరావతికి ఆహ్వానం పలుకుతున్న సురేఖ వాణి కూతురు..

Amaravathiki Ahwanam

Amaravathiki Ahwanam

Amaravathiki Ahwanam: ప్రజెంట్ ట్రెండ్‌లో హార‌ర్ సినిమాలు హ‌వా న‌డుస్తోంది. ప్రస్తుతం అదే త‌ర‌హాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త సినిమా ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’. ఈ చిత్రానికి జివికె దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి నిర్మాణ సార‌థ్యంలో జి.రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ క్రిస్మస్ శుభాకాంక్షల‌తో స‌రిక్రొత్త పోస్టర్, గ్లింప్స్‌‌ను రిలీజ్ చేశారు.

READ ALSO: Google Notebook : గూగుల్ నోట్‌బుక్‌లో సరికొత్త ‘లెక్చర్ మోడ్’..

ఈ సంద‌ర్భంగా.. ద‌ర్శకుడు జివికె మాట్లాడుతూ.. `ఈ మ‌ధ్య కాలంలో రిలీజైన అన్ని హార‌ర్ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్‌ హార‌ర్ థ్రిల్లర్ క‌థాశంతో వ‌స్తోన్న చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ, ఎస్తర్‌, సుప్రిత, శివహ‌రీశ్‌, అశోక్ కుమార్‌, జెమిని సురేశ్, భ‌ద్రమ్‌ కీల‌క పాత్రలు పోషించారు. . పద్మనాబ్ బ‌ర‌ద్వాజ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేట‌ర్స్‌లో ఆడియ‌న్స్‌ని హార‌ర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది` అని అన్నారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. అతి త్వర‌లో పోస్ట్ ప్రొడ‌క్షన్ పనులు పూర్తి చేసి సినిమాను థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

READ ALSO: Champion: ఛాంపియన్ సక్సెస్ గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది: నిర్మాత స్వప్న దత్

Exit mobile version