NTV Telugu Site icon

Amaran : అమరన్ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?

New Project 2024 10 24t113913.522

New Project 2024 10 24t113913.522

Amaran : టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్‌లోని ఖాజీపత్రి ఆపరేషన్‌లో యాక్షన్‌లో అమరులైన ఏసీ అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అమరన్. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది.

Read Also:US- Russia: రష్యా బలహీనపడింది.. అందుకే కిమ్‌ సైన్యం మద్దతు కోరుతుంది..!

ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి వస్తున్న దక్షినాది చిత్రాల్లో కోలీవుడ్ యాక్షన్ చిత్రం “అమరన్” కూడా ఒకటి. ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ్ లో డీసెంట్ బజ్ లోనే ఉంది. అయితే ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అయితే విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ సినిమా హక్కులు సొంతం చేసుకోగా థియేటర్స్ లో వచ్చిన దాదాపు పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందులో రానుంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రాబోతుంది.

Read Also:Swapnika: అల్లిక కళ.. స్వాప్నికకు గిన్నిస్ బుక్‌లో చోటు

Show comments