Site icon NTV Telugu

Amantullah Khan : ఆప్ ఎమ్మెల్యే పై బిగుస్తున్న ఉచ్చు.. అటాచ్‌మెంట్‌కు కోర్టు ఆదేశాలు

New Project (3)

New Project (3)

Amantullah Khan : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అతనిపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు తన కొడుకు అనాస్‌పై దాడి కేసులో కూడా ఇరుక్కున్నాడు. పెట్రోల్ పంప్ ఉద్యోగిపై దాడి కేసులో అమానతుల్లా ఖాన్‌పై నోయిడా సెషన్స్ కోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. సిఆర్‌పిసి సెక్షన్ 81/82 కింద కోర్టు అటాచ్‌మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. నోయిడాలో అమానతుల్లా ఖాన్‌, కుమారుడు అనాస్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నోయిడా పెట్రోల్ పంప్ ఉద్యోగిపై అనాస్ దాడి చేయగా, అమానతుల్లా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

Read Also:ACP Umamaheshwar Rao: నేటితో ముగియనున్నఉమామహేశ్వర్ రావు ఏసీబీ కస్టడీ..

దాడి, బెదిరింపులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటి నుంచి పోలీసులు అనాస్‌, అమానతుల్లా ఖాన్‌ కోసం వెతుకుతున్నారు. ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్, అనస్ చాలా కాలంగా పరారీలో ఉన్నారు. దీని కారణంగా ఇప్పుడు నోయిడా సెషన్ కోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్యే ఆస్తులను పోలీసులు ఎప్పుడైనా జప్తు చేయవచ్చు.

Read Also:Ram Mandir : మండుతున్న సూరీడు.. సగానికి పడిపోయిన అయోధ్య రాములోరి భక్తులు

అసలు విషయం ఏమిటి?
కొన్ని వారాల క్రితం, నోయిడాలోని సెక్టార్ 95లోని పెట్రోల్ పంపు వద్ద అనాస్ పంప్ అటెండర్‌పై దాడి చేశాడు. అనాస్ లైన్ బ్రేక్ చేసి, పంప్ వర్కర్ తన కారులో మొదట పెట్రోల్ నింపాలని డిమాండ్ చేశాడని, పంప్ వర్కర్ నిరాకరించడంతో అతన్ని కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో కుమారుడు అనాస్‌తో పాటు అతని భాగస్వామిపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటి నుంచి ఖాన్‌తో పాటు అతని కొడుకు పరారీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓఖ్లా స్థానం నుంచి అమానతుల్లా ఖాన్ ఎమ్మెల్యే. 2020లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇవే కాకుండా వక్ఫ్ బోర్డు భూముల్లో కుంభకోణం, బోర్డు నియామకాల్లో అవకతవకలు, బెదిరింపులు తదితర ఎనిమిది కేసులు అమానతుల్లా ఖాన్‌పై నమోదయ్యాయి.

Exit mobile version