Site icon NTV Telugu

Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలి

Asr

Asr

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘనంగా జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు క్షత్రియ సమితి సభ్యులు.తెలుగు ప్రజల ఖ్యాతి, విప్లవ జ్యోతి, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. వివిధ కూడళ్ళలో ఉన్న అల్లూరి సీతారామరాజు నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి, ఆయన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ అల్లూరి సీతారామ రాజు సర్కిల్ లో గల అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది.

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి శౌర్య ప్రతాపాలను కొనియాడారు. స్వాతంత్ర్య భారత సంగ్రామంలో శివాజీ తరువాత అంతటి పోరాట పటిమ కనపరచిన మహావీరుడు అల్లూరి సీతారామ రాజు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జానకి రామరాజు, డా॥ ఎమ్ ఆర్ ఎస్ రాజు, సాయి రాజు, కృష్ణం రాజు, కుచ్చర్లపాటి గోపాల కృష్ణంరాజు, గుణరంజన్ సాయి, రామకృష్ణం రాజు(ఆర్కే), శ్రీనివాస రాజు, భాస్కర రాజు, రామచంద్ర నాయక్, అబ్దుల్ నబీ, వై వీ రావు, రామ రాజు, అల్లూరి మనవడు అల్లూరి శ్రీరామ రాజు, కుందన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన నేతలు.. యువత పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.

Read Also: Train Tickets : పెంపుడు జంతువులకి ట్రైన్ లో ఆన్లైన్ టికెట్

Exit mobile version