Allu Shirish Wedding: అల్లు వారింట ఇంట పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన పెళ్లి పిలుపులు కూడా మొదలయ్యాయి. అల్లు శిరీష్ తన పెళ్లికి సంబంధించిన మొట్టమొదటి శుభలేఖను తన మావయ్య, అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్ సతీ సమేతంగా మెగా దంపతులకు నూతన వస్త్రాలు అందించి పెళ్లికి ఇన్వైట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో అల్లు శిరీష్‌కు తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. మార్చి 6న వీరిద్దరి వివాహం జరగనుంది.
READ ALSO: Vizag Navy Fest 2026: విశాఖ తీరంలో నౌకల పండగ.. 70 యుద్ధ నౌకలు.. 50 దేశాల అతిథులు..
ఓ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. వారి ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచకున్నారు. వరుణ్- లావణ్యల పెళ్లి నటుడు నితిన్ సతీమణి షాలినితో కలిసి నయనిక వచ్చింది. నిజానికి అప్పుడై ఫస్ట్ టైం నయనికను చూసినట్లు శిరీష్ తెలిపారు. తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలిపారు. అల్లు అర్జున్ – స్నేహారెడ్డి వివాహం కూడా 2011లో మార్చి 6నే జరగింది. మళ్లీ మార్చి 6న తేదీనే అల్లు శిరీష్ వివాహం జరుగుతుండటంతో అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
READ ALSO: Ragi Breakfast Recipes: బరువు తగ్గడానికి రాగులతో చేసే 7 ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇవే!