ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ‘పుష్ప-ది రూల్’ రిలీజ్ అవుతుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. నేడు ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ సహర్ హోటల్లో ప్రెస్ మీట్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం బన్నీ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 30న చిత్తూరులో మేకర్స్ ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. కండ్లకోయలోని మల్లారెడ్డి కాలేజీలో పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందట. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా.. మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడిందని, అందుకు వారు ఓకే అన్నట్లు సమాచారం. డిసెంబర్ 1న ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఈరోజు క్లారిటీ రానుంది. నార్త్ ను చుట్టేస్తున్న పుష్ రాజ్ కోసం తెలుగు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read: Naga Chaitanya-Sobhita: చై, శోభితలకు మంగళస్నానాలు.. వీడియో వైరల్!
పుష్ప 2 సెన్సార్ తాజాగా పూర్తయింది. యూ/ఏ వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో సినిమా రాబోతోంది. సెన్సార్ బోర్డు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ప్రకారం.. ఐదు విషయాల్లో మార్పు చేర్పులు చెప్పింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప2: ది రూల్’. రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ చేశారు.