NTV Telugu Site icon

Allu Sneha Arjun: అల్లు అర్జున్ భార్యకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం ఉండదట

Allu Arjun Snehareddy

Allu Arjun Snehareddy

Allu Sneha Arjun: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. బన్నీకి తగ్గట్లు స్నేహ కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. ఆమెకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ దంపతులను చూసిన వారందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, స్టైలిష్ కపుల్ గా సంబోధిస్తుంటారు. అయితే తాజాగా బన్నీ వైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. స్నేహా రెడ్డికి, తెలుగు స్టార్ హీరోయిన్లలో ఆ హీరోయిన్ అంటే అస్సలు ఇష్టం ఉండదని తెలుస్తోంది. ఇంతకి ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ఆమె రకుల్ ప్రీత్ సింగ్.

Read Also: Dussehra: ‘దసరా’కు ‘పుష్ప’ జ్ఞాపకాలు.. సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పై ఓ బ్యాడ్ రూమర్ ఉంది. అల్లు అర్జున్ విషయంలో లిమిట్స్ క్రాస్ చేసిన రకుల్, స్నేహారెడ్డి ఆగ్రహానికి గురయ్యారట. బన్నీకి ఇష్టం లేకపోయినా రకుల్ వెంటపడి వేధించారట. సరైనోడు మూవీ సమయంలో ఇది జరిగిందనేది టాలీవుడ్ టాక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సరైనోడు సాధించింది. ఈ మూవీ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నటించారు. సిల్వర్ స్క్రీన్ పై రకుల్, బన్నీ మంచి కెమిస్ట్రీ కురిపించారు.

కాగా ఆఫ్ స్క్రీన్ లో కూడా రకుల్ బన్నీని వదల్లేదట. బన్నీతో సన్నిహితంగా ఉండేందుకు రకు ఇష్టపడేవారట. బన్నీని తరచుగా కలవడానికి ట్రై చేసేవారట. ఇక ఫోన్లు, మెసేజ్లు సరాసరేనట. రకుల్ అలా రాసుకుపూసుకు తిరగడం బన్నీకి కూడా ఇబ్బందిగా అనిపించేదట. మొహమాటంతో చెప్పలేక రకుల్ ని భరించేవాడట. ఒకరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసున్నప్పుడు రకుల్ ఫోన్ చేశారట. బన్నీ ఆమెతో నిమిషాల తరబడి మాట్లాడటంతో స్నేహారెడ్డి ఆగ్రహానికి గురయ్యారట. బన్నీ చేతిలోని ఫోన్ లాక్కుని కాల్ కట్ చేశారట.

Read Also: Rajinikanth: పదేళ్ల తర్వాత యంగ్ హీరో సినిమాలో రజనీ గెస్ట్ రోల్

రకుల్ ప్రవర్తన గమనించిన స్నేహారెడ్డి ఆమె అంటే ఫైర్ అయ్యేవారట. బన్నీతో నటించిన చాలా మంది హీరోయిన్స్ ని ఇష్టపడే స్నేహారెడ్డి… రకుల్ అంటే మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారమైంది. అల్లు అర్జున్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. టైం దొరికితే ఫ్యామిలీతో విహార యాత్రలకు వెళ్తూ ఉంటాడు. పిల్లలతో గడిపే సందర్భాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. బన్నీ, స్నేహారెడ్డిల వివాహమై దాదాపు 11ఏళ్లు పూర్తయింది. మార్చి 6, 2011న వీరి వివాహమైంది.

Show comments