NTV Telugu Site icon

Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

Whatsapp Image 2024 12 27 At 10.29.19 Am

Whatsapp Image 2024 12 27 At 10.29.19 Am

Sandhya Theatre Incident : పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్​ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Read Also:Manchu Vishnu : సీఎంతో మీటింగుకు ‘మా’ ప్రెసిడెంట్ గైర్హాజరు.. ఆయన రాకపోవడానికి కారణం ఇదేనా ?

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో అల్లు అర్జున్ కు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో ఆయన నేడు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు నాంపల్లి కోర్టు కు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలుపనున్నారు.

Read Also:KCR: మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు..

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్​రెడ్డి సంధ్య థియేటర్​ ఘటనపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని, ప్రజల ప్రాణాలు కాపాడటమే తన బాధ్యత అని వెల్లడించారు. సంధ్య థియేటర్​ ఘటనపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి.. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు, షూటింగ్‌లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి.. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Show comments