Site icon NTV Telugu

Allu Arjun Pushpa 2: పుష్ప-2కు ఏడాది.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..

Pushpa

Pushpa

Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ పుష్ప 2 ది రూల్‌ విడుదలై అప్పుడే ఏడాది పూర్తైంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలిచింది. పుష్ప 2 గ్లోబల్‌ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన (జాతీయ) చిత్రంగా తన హోదాను పదిలం చేసుకుంది. అదనంగా పుష్ప 2 కోసం 20 నిమిషాల ప్రత్యేక కంటెంట్‌తో కూడిన రీలోడెడ్ వెర్షన్ ఇటీవల థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌కు కూడా అభిమానులు, మూవీ లవర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

అయితే.. పుష్ప-2 ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పిక్ ని షేర్ చేశాడు. పుష్ప 2 క్లైమాక్స్ పోర్షన్ లో దర్శకుడు సుకుమార్ తో కలిసి ఉన్న పిక్‌ని పంచుకున్నాడు. పుష్ప చిత్రం కోసం ఐదేళ్లు తాను, సినిమా యూనిట్ తో ప్రయాణం ఎప్పటికి మర్చిపోలేనిదని ఎమోషనల్ పోస్ట్ లో పేర్కొన్నాడు. “పుష్ప మా జీవితంలో ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణంగా నిలిచింది. ఈ మూవీపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాలో మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చిన ప్రతిఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం. ఇంత గొప్ప టీంతో పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని సోషల్ మీడియా పోస్ట్‌లో బన్నీ రాసుకొచ్చాడు.

Exit mobile version