Site icon NTV Telugu

Puspa 2 Trailer: పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఇకనుండి వైల్డ్ ఫైర్ అంటున్న ఐకాన్ స్టార్

Puspa

Puspa

Puspa 2 Trailer: ఆదివారం (నవంబర్ 17)న పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి అశేష సినీ అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నమస్తే.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం అని, నేను ఎప్పుడు పాట్నా వచ్చినా.. మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి పాట్నా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మీ ప్రేమంతా ఇక్కడ కనబడుతోందని, చాలా ధన్యవాదాలు అంటూ తెలిపారు. అందరూ ఎలా ఉన్నారని అడుగుతూనే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఇకనుండి వైల్డ్ ఫైర్ అంటూ సినిమాలోని డైలాగ్ చెప్పాడు. అలాగే తన హిందీ కాస్త మీకు ఇబ్బంది కరంగా ఉండొచ్చని, తప్పులుంటే నన్ను క్షమించగలరని ఆయన అభిమానులను కోరాడు.

Read Also: Indian Railways: వరుడి రైలు ఆలస్యం..పెళ్లి సమయానికి చేర్చిన రైల్వే.. ఎలా సాధ్యమైందంటే..?

ఈ సందర్భంగా.. తాను ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాని, మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే దేశం మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాని గత మూడు సంవత్సరాలుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే, ఇది నా గొప్పతనం కాదని, ఇదంతా మీ వల్లే సాధ్యమని అన్నారు. అలాగే ఈ సందర్భంగా పుష్ప సినిమా టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, అలాగే ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణమని అన్నారు. ‘పుష్ప’ సినిమాను భారీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. స్పాన్సర్స్‌కి, పోలీస్ సిబ్బందికి, అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. ఇక చివరగా డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోందని, అందరికీ నచ్చుతుందని చెబుతూ.. థ్యాంక్యూ బీహార్, థ్యాంక్యూ పాట్నా అని ఆయన అన్నారు. ఇక స్టేజిని వీడే ముందు అభిమానులు డైలాగ్ చెప్పమని అడగగా..‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఇకనుండి వైల్డ్ ఫైర్..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానుల ముచ్చట తీర్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Read Also: Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్.. 900 మంది పోలీసులు.. 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ

Exit mobile version