Site icon NTV Telugu

Allu Arjun : ఆ రెండు సినిమాలను మరోసారి గుర్తు చేసుకున్న ఐకాన్ స్టార్..

Whatsapp Image 2024 01 12 At 11.06.35 Pm

Whatsapp Image 2024 01 12 At 11.06.35 Pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో బ్లాక్‍బాస్టర్ హిట్స్ ఉన్నాయి.. కెరీర్ ఆరంభం నుంచి అల్లు అర్జున్ మంచి హిట్‍లు సాధించారు.అయితే ఆయన కెరీర్ లో జనవరి 12 సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ తన కెరీర్లో సూపర్ హిట్‍లుగా నిలిచిన దేశముదురు, అల వైకుంఠపురములో చిత్రాలను నేడు (జనవరి 12) గుర్తు చేసుకున్నారు . నేటితో దేశముదురు చిత్రానికి 17 ఏళ్లు పూర్తవగా.. అల వైకుంఠపురంలో వచ్చి నాలుగేళ్లయింది.దేశముదురు మరియు అల వైకుంఠపురములో సినిమాలను గుర్తు చేసుకుంటూ నేడు అల్లుఅర్జున్ ట్వీట్లు చేశారు . నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండేవి అంటూ రాసుకొచ్చారు. అల వైకుంఠపుములో సినిమా షూటింగ్ సమయంలోని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా గురించి ముందుగా పోస్ట్ చేశారు . “దేశముదురు” చిత్రం వచ్చి 17 ఏళ్లు పూర్తయింది. అది చాలా అందమైన సమయం. నా డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత డీవీవీ దానయ్యకు, మూవీ యూనిట్ మొత్తానికి థ్యాంక్స్. అద్భుతంగా దీవించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.2007 జనవరి 12వ తేదీన దేశముదురు సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదగడానికి దేశ ముదురు సినిమా కీలకపాత్ర పోషించింది. ఈ మూవీతోనే సిక్స్ ప్యాక్స్ ట్రెండ్ టాలీవుడ్‍ కు పూరిజగన్నాధ్ తీసుకు వచ్చారు.. ఈ చిత్రంతో అల్లు అర్జున్‍కు మాస్ ఇమేజ్ వచ్చింది. యాక్షన్, డ్యాన్స్ మరియు మాస్ డైలాగ్స్ ఇలా ఈ చిత్రంలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించింది. దేశ ముదురు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది.అలాగే 2020 జనవరి 12న విడుదలైన అల వైకుంఠపురములో చిత్రానికి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. అల్లు అర్జున్ కెరీర్లో ఈ చిత్రం కూడా బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. “అల వైకుంఠపురం చిత్రం వచ్చి 4 సంవత్సరాలు పూర్తి అయింది . అందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ సహా టీమ్‍తో కలిసి అల వైకుంఠపురంలో షూటింగ్ సమయంలో దిగిన మూడు ఫొటోలను కూడా అల్లుఅర్జున్ పోస్ట్ చేశారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ అలాగే అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు హైలైట్‍గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా ఎంతో హైలైట్ గా నిలిచింది.

Exit mobile version